సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులార్పించిన సీఎం కేసీఆర్

New Update
సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులార్పించిన సీఎం కేసీఆర్

CM KCR paid tribute to Saichand portrait of Hyderabad

ప్రముఖ గాయకుడు, బిఅర్ఎస్ నేత దివంగత సాయి చంద్‌కు. సీఎం కేసీఆర్‌ నివాళులార్పించారు. హైదరాబాద్‌ హస్తినాపురంలోని జీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరుగుతున్న సాయిచంద్‌ దశదిన కర్మకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి, పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రలు శ్రీనివాస్‌గౌడ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌, నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీశ్, వేద సాయి చంద్ అకాల మరణంతో వారి కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోంది. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు అకాల మరణం చెందడం సీఎం కేసీఆర్‌ను ఎంతగానో కలిచి వేసింది. దీంతో వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారి యోగక్షేమాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు 3 కోట్లకుపైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు పార్టీ నిర్ణయం తీసుకుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఇక కుసుమ జగదీష్, సాయిచంద్ తల్లిదండ్రులను కూడా పార్టీ తరపున ఆదుకుంటామన్నారు. సాయిచంద్ భార్యకు గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్టుగా మంత్రి కేటీఆర్ చెప్పారు.

Advertisment
తాజా కథనాలు