ఆర్టీసీని సీఎం కేసీఆర్ కాపాడుతున్నారు: మంత్రి పువ్వాడ అజయ్ టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 101 ప్రాంతాల్లో బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్ బస్టాండ్‌లో బ్లడ్ డొనేషన్ క్యాంపును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రక్తదానం పట్ల సిబ్బందిలో, ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ.. ఆర్టీసీ సంస్థ కొన్నేళ్లుగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోందన్నారు. By Vijaya Nimma 27 Jun 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఎలా ఉన్నాయి సౌకర్యాలు..? తెలంగాణ రాష్ట్రంలోని అన్ని డిపోలు, ప్రధాన బస్సు స్టేషన్లలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎంజీబీఎస్ బస్టాండ్ లోని ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ నిర్వహణను మంత్రి పరిశీలించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించి, అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందుల్లో ఆర్టీసీ సంస్థ ఆర్టీసీ పురోగతి కోసం ప్రజల నుంచి మద్దతు వస్తోందని, ఇప్పుడు రోజుకు రూ.15 కోట్ల ఆదాయం వస్తోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థల్లో ఇబ్బందులు ఉన్నాయని, వాటితో పోలిస్తే తెలంగాణ ఆర్టీసీ చాలా బెటర్‌గా ఉందన్నారు. ఈనెల ఆషాఢం వల్ల రెవెన్యూ తగ్గుతుందన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కొత్త కొత్త కార్యక్రమలు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ రూ.500 కోట్ల నష్టంలో ఉందని, గత ఏడాది రూ.19 వందల కోట్ల నష్టం తగ్గించుకున్నామన్నారు. 760 కొత్త బస్సులు ప్రారంభించామన్నారు. త్వరలో సిటీలో ఎలక్ట్రిక్ బస్సులను స్టార్ట్ చేస్తామన్నారు. బస్సులు, బస్టాండ్‌లు మంచిగా ఉంటే ప్రయాణికుల నుంచి మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఈ ఏడాది 150 బస్టాండ్‌లు ఆధునికీరణ చేస్తామన్నారు. మంచి వసతులు.. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్ల నుంచి ఎక్కువ మంది జర్నీ చేస్తున్నారు. ఈ రెండు చోట్ల వసతులు మంచిగా ఉండాలి. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారింది. ఎయిర్ పోర్ట్, మెట్రోకు కనెక్టివిటీ పెంచుతాం. 45 వేల మంది ఉద్యోగులు, కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఆర్టీసీతో ప్రతి వ్యక్తికి ఎంతో అనుబంధం ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల కోసమే పీఆర్సీ రద్దు రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను సీఎం కేసీఆర్ కాపాడారని మంత్రి వ్యాఖ్యానించారు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. దీనిపై ఫైనాన్స్ అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల కోసమే తాము పీఆర్సీ ఇవ్వలేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను, కార్మికులను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికులకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నామని చెప్పారు అక్కడి మాదిరిగా ఇక్కడ లేదు ప్రైవేట్ ట్రావెల్స్‌ను అడ్డుకోలేమని, దీనిపై ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఓలా, ఉబర్ ప్రైవేట్ ట్యాక్సీలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. తమకు ప్రైవేట్ వెహికిల్స్ ప్రధాన పోటీ అని వాటిని నిలవరించలేమన్నారు. ఆర్టీసీ, ఆర్టీఏ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మాదిరిగా ఇక్కడ కూడా అలాంటి ప్రతిపాదన గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు మంత్రి పువ్వాడ అజయ్. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి