శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్‌ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు విభాగాల వారీగా ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్‌కు, బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ 30శాతం పెంచుతూ ఇస్తున్నట్లు తెలిపారు.

శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్
New Update

CM KCR gave the good news

దశాబ్ది ఉత్సవాల ముగింపు

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పించనర్లకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్‌ విషయంలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలవెన్స్ పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30శాతం, బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ 30శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. లిఫ్ట్ ఆపరేటర్లు, డైవర్లు సెలవు రోజుల్లో పనిచేస్తే అదనంగా రూ. 150 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగులు, పింఛనర్లకు 30 శాతం రాయితీ..

స్టేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్ 30శాతం పెంచింది. గ్రేహౌండ్స్, ఇంటిలిజెన్స్, ట్రాఫిక్, సీఐడి, ఆక్టోపస్, యాంటి నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేస్‌ను 2020 పే స్కేల్ ప్రకారం వర్తింపచేస్తారని పేర్కొంది. పింఛనర్లు చనిపోతే అందించే తక్షణ సాయం రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు పెంచింది. ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తించే అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15శాతం స్పెషల్‌పే మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విభాగాల వారీగా ఉత్వర్వులు జారీ చేసింది.

అలవెన్స్‌పై ఉత్తర్వులు జారీ

దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని పెంచింది. రూ. 20 లక్షల నుంచి రూ. 30లక్షలకు పెంచుతున్నట్లు జీవోలో తెలిపింది. కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 6లక్షల నుంచి 9 లక్షలకు పెంచింది. మోటార్‌ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ 80వేల నుంచి రూ. లక్షకు పెంచింది. ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్ళకు సంబంధించి, కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ లక్ష నుంచి రూ. 4 లక్షలు, కుమారుడి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 75వేల నుంచి రూ. 3 లక్షలకు పెంచింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe