Bhadradrikottagudem: సీఎం కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి కోనేరు చిన్ని

నేడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్న కోనేరు చిన్ని అలియాస్ సత్యనారాయణ. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్న సీఎం కేసీఆర్. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన కోనేరు చిన్ని. 3 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిక. భారీ ర్యాలీగా కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కోనేరు చిన్ని. ముఖ్య అనుచరులతో కలిసి బీఆర్ఎస్‌లో కోనేరు చిన్ని చేరనున్నారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్‌లోకి కోనేరు చిన్ని.

Bhadradrikottagudem: సీఎం కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి కోనేరు చిన్ని
New Update

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. 2014-18 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలు రిపీట్ అవ్వకుండా ఉండేలా స్కెచ్ సిద్ధం చేశారు. ప్రధానంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విజయఢంకా మోగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూనే ప్రతిపక్ష పార్టీల్లోని కీలక నేతలను బీఆర్ఎస్‌లో చేర్చేలా పథకం రచించారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకుని క్లీన్ పాలిటిక్స్ కేరాఫ్‌గా మారిన కోనేరు కుటుంబాన్ని బీఆర్ఎస్‌లో చేరాలని కోరారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. తద్వారా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ప్రతిపక్షాలకు బ్రేక్ వేస్తూనే రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు.

నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. దివంగత నేత మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు. టీడీపీ పార్టీ స్థాపన సమయంలో ఎన్టీఆర్ పిలుపుమేరకు పార్టీలో చేరిన కోనేరు నాగేశ్వరరావు అనతికాలంలోనే పార్టీలో మూలస్థంబంగా ఎదిగారు. ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా.. ఎళ్లవేళలా అండగా ఉంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో ఎనలేని పాత్ర పోషించారు. 1983లో తొలిసారి కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యుడిగా కోనేరు నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. తదనంతరం 1985-94 సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. సౌమ్యుడిగా, ఎన్టీఆర్‌కు విశ్వాసపాత్రుడిగా మెలిగిన కోనేరు నాగేశ్వరరావును ఎన్టీఆర్ తన కేబినెట్‌లోనే నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు కల్పించారు. ఎన్టీఆర్ కుటుంబానికి, టీడీపీ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన అనతికాలంలోనే రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా మలిచారు. భద్రాచలం ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, పాల్వంచ ఏపీ స్టీల్స్ చైర్‌గా సేవలందించిన ఆయన అనారోగ్యంతో 2016 అగస్టు 15న అనారోగ్యంతో కన్నుమూశారు.

రంగంలోకి రాజకీయ వారసుడు..

ఎమ్మెల్యేగా.. మంత్రిగా కోనేరు నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో తెరవెనుక రాజకీయ మంత్రాంగం నడుపుతూ తండ్రికి వెన్నుముకలా మారిన కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు చిన్ని అలియాస్ సత్యనారాయణ తండ్రి మరణానంతరం క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తండ్రి బ్రతికున్న సమయంలో టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో.. తండ్రి మరణానంతరం పార్టీ జిల్లాలో బలహీన పడుతున్న సమయంలో పార్టీ పగ్గాలు చేపట్టి టీడీపీ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి కొత్తగూడెం నియోజకవర్గంలో గెలుపోటములను నిర్దేశించే నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారు.

కలిసి రాని కూటమి.

టీడీపీ పార్టీలో వెలుగు వెలిగిన కోనేరు కుటుంబానికి కొత్తగూడెం నియోజకవర్గంలో ఎనలేని ప్రజాదరణ ఉన్నా తండ్రి కోనేరు నాగేశ్వరరావు రాజకీయ వారసుడిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన కోనేరు చిన్నికి మాత్రం కాలం కలిసిరాలేదు. కొత్తగూడెం నియోజకవర్గ రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా.. తండ్రికి తగ్గ వారసుడిగా పేరు తెచ్చుకున్న టీడీపీ పార్టీ అధినాయకత్వం చేసిన కొన్ని తప్పుడు నిర్ణయాలు కోనేరు చిన్నిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకుండా చేసింది. ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న సమయంలోనూ పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు సీటు కేటాయించి పార్టీ ఆత్మహత్య సదృశానికి పాల్పడింది. 2009లో పొత్తులో భాగంగా కమ్యూనిస్టుపార్టీకి కట్టబెట్టింది. దీంతో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి గెలుపులో కీలకపాత్ర పోషించారు కోనేరు చిన్ని‌.

కోనేరు చిన్నికి కేసీఆర్ ఆహ్వానం..

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 20018 సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ కోనేరు చిన్ని రాకతో జవసత్వాలు నింపుకుంది. కోనేరు చిన్నికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కల్పించి పార్టీని జిల్లాలో సంస్థాగత బలోపేతం చేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కొత్తగూడెం స్థానం నుంచి కోనేరు చిన్నిని బరిలో దింపి బోణీ కొట్టాలని భావించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై బీజేపీ అధిష్టానం సరైన దృష్టిసారించకపోవడంతో అసంతృప్తిగా ఉన్న కోనేరు చిన్నిని పార్టీలో చేర్చుకోవాలని భావించిన సీఎం కేసీఆర్ పలు దఫాలుగా కోనేరు చిన్నికి మద్యవర్తుల ద్వారా సందేశం పంపారు. కొత్తగూడెం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికోసం తాను భవిష్యత్తును కోల్పోడానికైనా సిద్ధమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తన అనుచరులు, ముఖ్య నేతలతో కలిసి బీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు కోనేరు చిన్ని. అయితే బీజేపీ అభ్యర్థిత్వాన్ని తృణప్రాయంగా వదిలిన కోనేరీ చిన్నికీ సీఎం కేసీఆర్ చేసిన ఆఫర్ ఏంటి..? ఈసారైనా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కోనేరు చిన్ని అడుగుపెట్టాలని పరితపించే ఆయన క్యాడర్ కోరిక ఫలిస్తుందా..? బీఆర్ఎస్ బలోపేతానికి.. రాబోయే ఎన్నికల్లో గెలుపుకు.. ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలనే యోచనతో కోనేరు చిన్నిని పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ చిన్నికి పార్టీలో ఎటువంటి స్థానం కల్పిస్తారో తెలియదు గానీ చిన్ని రాజీనామాతో బీజేపీకి మాత్రం జిల్లాలో కోలుకోలేని ఎదురుదెబ్బ మాత్రం తగిలింది.

#ktr #cm-kcr #bhadradrikottagudem #focus #koneru-chinni #entered-brs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe