CM KCR: తుంగతుర్తిలో కేసీఆర్ సంచలన హామీ

తుంగతుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్ ను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గమంతా దళితబంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఖతం అవుతుందన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అని అన్నారు కేసీఆర్.

KCR : కేసీఆర్ సంచలన నిర్ణయం.. వారికి ఎంపీ టికెట్ కట్?
New Update

24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మేము తాము అక్కడ రైతులకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెబుతున్నాడని సీఎం కేసీఆర్ (CM KCR) ఫైర్ అయ్యారు. అంతకన్నా దిగజారుడు ఉంటదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో నమ్మి ఓటేస్తే గ్యారెంటీగా కాంగ్రెస్ (Congress) కరెంటును ఖతం చేస్తుందన్నారు. కాంగ్రెస్ వస్తే.. తెలంగాణ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తదన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇది కూడా చదవండి: KTR Live: మా పాలన సంక్షేమానికి స్వర్ణయుగం.. మళ్లీ గెలిచేది మేమే: కేటీఆర్

తుంగతుర్తిలో గాదరి కిశోర్ కుమార్ ను మరో సారి లక్ష మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గం అంతా దళితబంధు పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని అంటున్నారని.. అదే జరిగితే రైతు బంధు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఎన్ని పోరాటాలు చేసినా.. ఏ పార్టీ కూడా ఈ ప్రాంతంపై కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తుంగతుర్తి ప్రాంతం గతంలో కరువుకు గురైందన్నారు.
ఇది కూడా చదవండి: CM KCR speech: తుమ్మల వల్లే పార్టీకి అన్యాయం…పాలేరు సభలో సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

నేడు ఇక్కడి చెరువులన్నీ నీళ్లతో నిండుకున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమే ఇందుకు కారణమన్నారు. తుంగతుర్తిని చూస్తే తనకు నేడు తృప్తిగా ఉందన్నారు. దేవాదుల ప్రాజెక్టు నీళ్లు కూడా ఇక్కడికి తెస్తామన్నారు. రైతు బంధు ఇచ్చి.. ప్రజలు కట్టిన ట్యాక్స్ ను వేస్ట్ చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడని ఫైర్ అయ్యారు. పీసీసీ చీఫ్ రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతదని అంటున్నాడని మండిపడ్డారు. 24 గంటల కరెంట్ కావాలా?, 3 గంటల కరెంట్ కావాలా? అన్నది ప్రజలు తేల్చుకోవాలని కేసీఆర్ కోరారు.

#cm-kcr #telangana-elections-2023 #brs-party
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe