CM KCR: గజ్వేల్ లో కేసీఆర్ నామినేషన్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ లో కామారెడ్డికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్ వేయనున్నారు గులాబీ బాస్.

New Update
CM KCR: గజ్వేల్ లో కేసీఆర్ నామినేషన్

గజ్వేల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా (BRS) సీఎం కేసీఆర్ (CM KCR) కొద్ది సేపటి క్రితం నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్ లోని ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ కంప్లెక్ల్స్ లో ని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కేసీఆర్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్ ప్రత్యేక హెలికాఫ్టర్ లో గజ్వేల్ వెళ్లారు. కేసీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. నామినేషన్ కార్యక్రమం తర్వాత కేసీఆర్ కామారెడ్డికి వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటల సమయంలో కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇది కూడా చదవండి: Telangana: ఈరోజే పొలిటికల్ స్టార్ల నామినేషన్.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు, ఈటల

publive-image

తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడ పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 2018లోనూ ఇక్కడి నుంచే గెలుపొంది రెండో సారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి కూడా బరిలోకి దిగుతున్నారు కేసీఆర్. గజ్వేల్ లో కేసీఆర్ పై బీజేపీ తరఫున ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.
publive-image

ఇది కూడా చదవండి: Big Breaking: పొంగులేటి నామినేషన్‌కు పర్మిషన్.. వెంట ఐటీ అధికారులు కూడా..

కామారెడ్డిలో కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. కేసీఆర్ రాష్ట్రమంతా ప్రచారం చేయాల్సి ఉన్న నేపథ్యంలో గజ్వేల్ ఇంచార్జిగా మంత్రి హరీశ్ రావు, కామారెడ్డి ఇంచార్జిగా మంత్రి కేటీఆర్ ను నియమించింది బీఆర్ఎస్.

Advertisment
Advertisment
తాజా కథనాలు