తెలంగాణ ఎన్నికల (TS Elections 2023) తర్వాత మెజార్టీ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతూ.. కార్యకర్తలు 3వ తేదీ ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిన అవసరం లేదని.. సంబరాలు స్టార్ట్ చేసుకోవచ్చని చెప్పి సంచలనం సృష్టించారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని అనేక సార్లు చెప్పారు రేవంత్. ఇదిలా ఉంటే.. అధికారం మళ్లీ మాదేనని బీఆర్ఎస్ నేతలు సైతం ధీమాగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ రివర్స్ కావడం ఖాయమని కేటీఆర్ (KTR) చెప్పగా.. ఈ నెల 4న కేబినెట్ మీటింగ్ ఉంటుందని ప్రకటించి మరో సంచలనం సృష్టించారు కేసీఆర్.
ఇది కూడా చదవండి: మరో మూడేళ్లు కేసీఆరే సీఎం.. ట్విస్ట్ ఇచ్చిన ప్రముఖ జ్యోతిష్యుడు
తద్వారా తమదే అధికారం అన్న సంకేతాలు ఇచ్చారు సీఎం. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జి మన్నె క్రిశాంక్ మరో సంచలనానికి తెర లేపారు. ప్రగతి భవన్ కు రంగులు వేస్తున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. మూడో సారి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలోనే ఈ పెయింటింగ్ వర్క్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
''That is CM KCR'' అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు క్రిషాంక్. హ్యాట్రక్ కొడుతున్నాం అంటూ బీఆర్ఎస్, కేసీఆర్ అభిమానులు కామెంట్లు పెడుతుండగా.. అంత సీన్ లేదంటూ కాంగ్రెస్ మద్దతుదారులు కామెంట్ చేస్తున్నారు. మరో వైపు 'My Hero' అంటూ కేసీఆర్ వీడియోతో కవిత చేసిన పోస్టు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.