CM Jagan: ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో అందరి చూపు ఇక్కడే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల తోపాటు, బుల్లితెర ప్రముఖులు, దర్శకులు, సైతం పవన్ కు అండగా నిలుస్తున్నారు. పవన్ ను గెలిపంచాలని ప్రచారాలు కూడా చేశారు. దీంతో ఈ నియోజకవర్గం స్పెషల్ గా మారింది.
పూర్తిగా చదవండి..CM Jagan: నేడు పవన్ నియోజకవర్గంలో జగన్ ప్రచారం..!
జనసేన అధినేత పవన్ నియోజకవర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జగన్ చివరి ఎన్నికల ప్రచారం పిఠాపురంలో నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం జగన్ తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
Translate this News: