/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pawan-19.jpg)
CM Jagan: ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం ఎంత స్పెషలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో అందరి చూపు ఇక్కడే ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల తోపాటు, బుల్లితెర ప్రముఖులు, దర్శకులు, సైతం పవన్ కు అండగా నిలుస్తున్నారు. పవన్ ను గెలిపంచాలని ప్రచారాలు కూడా చేశారు. దీంతో ఈ నియోజకవర్గం స్పెషల్ గా మారింది.
Also Read: ఎమ్మెల్యే రాచమల్లు నీచనికృష్టుడు.. చివరికి తల్లిని సైతం..
ఇదిలా ఉంటే..నేడు ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరింది. పార్టీ అధినేతలు ప్రచారాలతో దూసుకెళ్తున్నారు. సీఎం జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. అయితే, చివరి ప్రచారం జనసేన అధినేత పవన్ నియోజకవర్గంలో నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. మధ్యాహ్నం 3 గంటలకు పిఠాపురంలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.