/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/jagan-23.jpg)
AP CM Jagan : ఏపీలో ఒకపక్క వైసీపీ - టీడీపీ(YCP-TDP) నేతలు, కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తుంటే.. జగన్ సర్కార్(Jagan Sarkar) మాత్రం విదేశాలకు పయనం అయ్యారు. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులను అదుపు చేయాల్సిన సీఎం.. ఇప్పుడు విదేశి పర్యటనకు వెళ్లనుండడంతో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. తీవ్ర ఘర్షణలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతుంటే..సర్కార్ మాత్రం సైలెంట్ గా తప్పించుకుంటున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Also Read: మెగా ఫ్యామిలీలో చిచ్చు.. అల్లు అర్మీ దెబ్బ .. ట్విట్టర్ డియాక్టివేట్ చేసిన నాగబాబు..!
సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి నేడు విదేశాలకు వెళ్లనున్నారు. రాత్రి 11 గంటలకు విజయవాడ(Vijayawada) నుంచి బయల్దేరి తొలుత లండన్(London) వెళ్లనున్నారు. జూన్ 1 వరకు ఆయన లండన్, ఫ్రాన్స్ , స్విట్జర్లాండ్ లో పర్యటిస్తారు. జగన్ విదేశీ పర్యటనకు ఇటీవల నాంపల్లి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.