AP Elections 2024: నెల్లూరు ఎంపీ టికెట్ పంచాయితీకి జగన్ చెక్.. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి అభ్యర్థులు వీరే!

సీఎం జగన్ తో చర్చలు జరిపిన తర్వాత నెల్లూరు ఎంపీగా పోటీ చేయడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓకే చెప్పినట్లు సమాచారం. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్, కావలి నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి కుటుంబీకులు పోటీ చేస్తారని సీఎం జగన్ ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది.

New Update
AP Elections 2024: నెల్లూరు ఎంపీ టికెట్ పంచాయితీకి జగన్ చెక్.. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి అభ్యర్థులు వీరే!

వైసీపీలో (YCP) నెల్లూరు పంచాయితీ ముగిసింది. సీఎం జగన్ తో (AP CM Jagan) మాట్లాడిన తర్వాత నెల్లూరు ఎంపీ గా పోటీ చేయడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్, కావలి నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి ఫ్యామిలీ సభ్యులు పోటీ చేస్తారని సీఎం జగన్ వేమిరెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం చొరవతో నెల్లూరు జిల్లా వైసీపీలో కొన్ని రోజులుగా నెలకొన్న వివాదానికి తెరపడింది.
ఇది కూడా చదవండి: YS Sharmila : షర్మిలతో రాయబారాలు చేయలేదు.. విజయమ్మను కలిసింది అందుకే: వైవీ సుబ్బారెడ్డి సంచలన ప్రకటన

ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిశారు. నెల్లూరు పార్లమెంట్ సీటు విషయంలో సీఎం జగన్ తో ఆయన చర్చించారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో 3 సీట్లు మార్చాలని, లేకపోతే తాను ఎంపీగా పోటీ చేయనని వేమిరెడ్డి చాలా రోజులుగా చెబుతున్నారు. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి అభ్యర్థులను మార్చాలని పట్టపడుతున్నారు.

పార్టీ ఒప్పుకోకపోవడంతో తాను పోటీ చేయనని వేమిరెడ్డి ప్రకటించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో సీఎం జగన్ రంగంలోకి దిగి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో చర్చలు జరిపారు. ఎంపీగా పోటీ చేసేందుకు ఒప్పించారు. దీంతో ఆయా ఎమ్మెల్యే అభ్యర్థులు, వారి అనుచరులు, కేడర్ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisment
తాజా కథనాలు