CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఫైనల్

సీఎం జగన్ ఎన్నికలపై ఫోకస్ పెంచారు. రెండు స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. కర్నూల్ సిట్టింగ్ వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో గుమ్మనూరు జయరాం పేరును ఫైనల్ చేశారు. అలాగే.. ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరుపాక్షి పేరును ఖరారు చేశారు.

New Update
CM Jagan: సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ ఇద్దరు ఫైనల్

AP Elections: ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలతో (Parliament Elections) పాటు అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) జరగనున్నారు. ఈ క్రమంలో నేతల రాజీనామాలు, చేరికలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అటు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ జెండా (YSRCP) ఎగురవేయాలని సీఎం జగన్ (CM Jagan) వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులను మారుస్తూ.. కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు. వైసీపీ చేసిన అభ్యర్థుల మార్పుల వల్ల కొందరు వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా కర్నూలు సిట్టింగ్ వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ (MP Sanjeev Kumar) రాజీనామా చేయడంతో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం పేరును ఫైనల్ చేశారు. అలాగే.. ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా విరుపాక్షి పేర్లను ఖరారు చేశారు సీఎం జగన్.

ALSO READ: ట్రాఫిక్ చలాన్లపై రాయితీ పొడిగింపు

వైసీపీలోకి కేశినేని నాని..

విజయవాడ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. టీడీపీకి (TDP) రాజీనామా ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ తో (CM jagan) ఈ రోజు భేటీ అయ్యారు కేశినేని నాని. నానితో పాటు జగన్‌ను (Jagan) ఆయన కుమార్తె శ్వేత కూడా కలిశారు. ఎంపీ పదవికి ముందుగా రాజీనామా చేసి.. ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకోవాలన్నది నాని ఆలోచనగా తెలుస్తోంది.

ఇప్పటికే తన కార్పొరేటర్‌ పదవికి, టీడీపీకి నాని కుమార్తె శ్వేత రాజీనామా చేశారు. ఒక ఎంపీ, నాలుగు ఎమ్మెల్యే సీట్లను నాని వైసీపీని అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. నానికి సముచిత స్థానం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. జగన్‌తో భేటీకి ముందు నానిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అయోధ్య రామిరెడ్డి, దేవినేని అవినాష్‌ తదితరులు కలిసినట్లు తెలుస్తోంది.

టీడీపీ చిచ్చు పెట్టింది...

జగన్ తో భేటీ తర్వాత కేశినేని నాని మాట్లాడుతూ.. టీడీపీ తనను అనేక సార్లు అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంలో టీడీపీ చిచ్చుపెట్టిందన్నారు. చంద్రబాబు ఏపీకి పనికిరాని వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. తనను చెప్పితీసుకొని కొడతానని ఓ క్యారెక్టర్ లెస్ వ్యక్తి తిట్టినా పార్టీ పట్టించుకోలేదన్నారు. సీఎం కార్యక్రమాలకు తనను హాజరుకాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడని ఆరోపించారు. సొంత వ్యాపారాల కన్నా పార్టీ ముఖ్యమని భావించి పని చేశానన్నారు.

Advertisment
తాజా కథనాలు