/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/AP-CM-Jagan-.jpg)
CM Jagan Tweet AP Election Results: దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చిందని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు కొద్ది సేపటి క్రితం ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతీ కుటుంబానికీ తమ ప్రభుత్వం మంచి చేసిందన్నారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుందన్నారు. ఈ పోస్ట్ ద్వారా మరో సారి తాము గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు జగన్.
దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది.
ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి… pic.twitter.com/6EOA8CGend— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2024
ఇదిలా ఉంటే.. విదేశీ పర్యటన (Foreign Tour) ముగించుకుని సీఎం జగన్, భారతి దంపతులు రేపు రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాత్రి వారు లండన్ నుంచి వారు తిరుగు ప్రయాణం కానున్నారు. రేపు ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకోనున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో జగన్ పర్యటించారు. పర్యటన ముగించుకుని15 రోజుల అనంతరం రేపు రాష్ట్రానికి రానున్నారు జగన్.