CM Jagan : షర్మిల పోటి చేయడం బాధగా లేదు.. కానీ, ఇలా చేయడం కరెక్ట్‌ కాదు..!

కడప ఎంపీ స్థానంలో తన చెల్లెలు షర్మిల పోటీ చేయడంపై తనకు బాధగా లేదన్నారు సీఎం జగన్. ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షర్మిల చేస్తోంది కరెక్ట్ కాదన్నారు. షర్మిలను, కాంగ్రెస్‌ను సీఎం రేవంత్ ద్వారా చంద్రబాబే నడిపిస్తున్నారని ఆరోపించారు.

CM Jagan : షర్మిల పోటి చేయడం బాధగా లేదు.. కానీ, ఇలా చేయడం కరెక్ట్‌ కాదు..!
New Update

AP CM Jagan : కడప(Kadapa) ఎంపీ స్థానంలో తన చెల్లెలు షర్మిల(YS Sharmila) పోటీ చేయడంపై సీఎం జగన్(CM Jagan) స్పందించారు. తన చెల్లి షర్మిల పోటి చేయడం తనకు బాధగా లేదన్నారు. ఓ నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షర్మిలకు డిపాజిట్లు కూడా రావన్నారు. అదే తనను తీవ్రంగా బాధకు గురిచేస్తోందన్నారు జగన్‌. షర్మిల చేస్తోంది కరెక్ట్‌ కాదన్నారు.

Also Read: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు

అక్రమ కేసుల ఛార్జిషీట్లలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhara Reddy) పేరు, తన పేరును చేర్చించింది కాంగ్రెస్, టీడీపీలేనన్నారు. ఇప్పుడు షర్మిలను, కాంగ్రెస్‌ను సీఎం రేవంత్ ద్వారా చంద్రబాబే నడిపిస్తున్నారని ఆరోపించారు.

#andhra-pradesh #chandrababu #cm-jagan #ys-sharmila
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe