CM Jagan 20 Lakhs Ex gratia To Geethanjali Family: ట్రోలింగ్ కారణంగా చనిపోయిన గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం జగన్. ఆడబిడ్డల మర్యాదకు భంగం కలిగించేవారిని చట్టం వదిలిపెట్టదని అన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవాలని వైసీపీ నేతలకు సీఎం జగన్ ఆదేశం ఇచ్చారు. గీతాంజలి పిల్లల చదువు, భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ అన్నారు. ఆడబిడ్డల మర్యాదకు భంగం కలిగించేవారిని వదిలి చట్టం పెట్టదని అన్నారు.
చాలా బాధించింది: మంత్రి రోజా
గీతాంజలి ఆత్మహత్యపై స్పందించారు మంత్రి రోజా. గీతాంజలి ఆత్మహత్య చాలా బాధించిందని అన్నారు. సోషల్ మీడియా వేదికగా గీతాంజలిని ఐ-టీడీపీ, జనసేన ఎంతగా వేధించారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. గీతాంజలి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం అని అన్నారు. ఇప్పటికైనా సోషల్ మీడియా హద్దుల్లో ఉండాలని హితవు పలికారు.
ALSO READ: మాజీ మంత్రి కేటీఆర్‌కు అస్వస్థత
అసలేమైంది..
జగనన్న(YS Jagan) నాకు ఇల్లు ఇచ్చాడు. నాకల నెరవేరింది. నేనిప్పుడు సంతోషంగా ఉన్నానంటూ… మాట్లాడిన గీతాంజలి(Geethanjali) అనే మహిళా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యింది. నాకు ఇల్లు వస్తుందనుకోలేదు. వేదికపై జగనన్న చేతులమీదుగా తీసుకుంటానని అస్సలు ఊహించలేదని చెబుతూ సంబురపడింది. ఈసంతోషంలో ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడింది. ఆమె మాటలు కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారాయి. గీతాంజలి రైలు కిందపడి సూసైడ్(Suicide) చేసుకుంది.
పిల్లలను వదిలేసి..
ఏపీలోని తెనాలి(Tenali) కి చెందిన గీతాంజలి వయస్సు 29 ఏండ్లు. ఈమెకు బాలచంద్ర అనే వ్యక్తితో పెళ్లి అయ్యింది. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సొంతిల్లు లేని వీరికి ఇటీవల జగన్ సర్కార్ ఇళ్లు పట్టా అందింది. తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో గీతాంజలికి పట్టా అందజేశారు. ఇన్నాళ్లకు సొంతింటి కల నెరవేరుతోందని సంతోషపడింది. ఓ మీడియా ఛానెల్ ఎదుట తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆమె మాటలు కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె చేసిన వీడియోపై కొంత మంది ట్రోల్స్ చేశారు. ఇలా చెప్పడానికి ఎంత తీసుకున్నావ్?, ఎంత ఇచ్చారు? .. అంటూ కొందరు సోషల్ మీడియాలో భూతులు పెట్టగా.. అది చూసి తట్టుకోలేకపోయిన గీతాంజలి రైలు కింద ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణం ఇద్దరి చిన్నారులకు తల్లి లేని లోటును మిగిల్చింది.