Ashok Gehlot : కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలపై సీరియస్.. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు గహ్లోట్ క్లాస్ రాజస్థాన్ లోని కోటాలో ఈమధ్యకాలంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం కోచింగ్ సెంటర్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి వారికి క్లాస్ పీకారు. ఆత్మహత్యలను అరికట్టేందుకు కమిటీ వేయాలని సీఎం గెహ్లాట్ అధికారులను ఆదేశించారు. By Bhoomi 19 Aug 2023 in నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Ashok Gehlot is serious about student suicides in Kota : రాజస్థాన్‌లోని కోటాలో దేశంలోని పలు ప్రాంతాల విద్యార్థులు NEET, JEE వంటి పరీక్షలకు కోచింగ్ తీసుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. అయితే ప్రస్తుతం కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల ఉదంతాలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. డాక్టర్, ఇంజనీరింగ్ కావాలన్న కలతో వచ్చిన 21మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత 8 నెలలుగా కోటాలో పెరుగుతున్న ఆత్మహత్యలపై గెహ్లాట్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. శుక్రవారం కోటా కోచింగ్ ఆపరేటర్లతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కోచింగ్ సెంటర్ల నిర్వహాకులను మందలించారు. ఆత్మహత్యలను అరికట్టేందుకు సూచనలు చేసేందుకు ఓ కమిటీ కమిటీని ఏర్పాటు చేసి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. #WATCH | You are committing a crime by enrolling students of Classes IX and X to coaching institutes. It is also the parents’ fault. Students face the burden of clearing the board exams and preparing for entrance exams...It's time for improvement as we cannot see young students… pic.twitter.com/vWUGORbf3T— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 18, 2023 9, 10వ తరగతి విద్యార్థులను ఇక్కడ చేర్పించి నేరం చేస్తున్నారు. ఇందులో విద్యార్థుల తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. 9, 10వ తరగతి విద్యార్థులపై ఒత్తిడి ఎందుకు పెంచుతున్నారు. వారు కూడా తరగతిలో ఉత్తీర్ణతతోపాటు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలన్న భారం పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. పిల్లల ఆత్మహత్యలను చూడలేక ఇప్పుడు వ్యవస్థను మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు. పిల్లల మరణం వారి తల్లిదండ్రులకు తీరని లోటు. ఇప్పుడు ఈ వ్యవస్థను మార్చాల్సిన బాధ్యత మీపై ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని తెలిపారు. #rajasthan #ashok-gehlot #quota #cm-ashok-gehlot #rajasthan-cm-coaching మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి