CM Chandrababu: ఎపీ సీఎంగా తొలి రోజు చంద్రబాబు దూకుడు పెంచారు. తాత్సారంగా చేయకుండా వెంటవెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. స్కూల్ పిల్లలకు ఇచ్చే కిట్పైన జగన్ బొమ్మ ఉన్నా పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ డబ్బులు వృధా కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈరోజు నుంచి బడులు తెరవడంతో విద్యార్థులకు స్కూలు కిట్ పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.
టీడీపీ ట్విట్టర్ (X)లో.."బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రికి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృధా కాకూడదు. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడదంటూ... జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిట్స్ ను అలాగే పంపిణీ చేయమని ఆదేశించిన సీఎం చంద్రబాబు గారు." అంటూ రాసుకొచ్చింది.