CM Chandrababu: ఊరుకునేది లేదు.. చంద్రబాబు హెచ్చరికలు

AP: తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా అని సీఎం చంద్రబాబు అన్నారు. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానని పేర్కొన్నారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదని అన్నారు.

New Update
CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: తిరుమలలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతా అని అన్నారు. తిరుమలలో గోవింద నామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానని పేర్కొన్నారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదని అన్నారు. తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని తెలిపారు. తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దని హెచ్చరించారు. గత ఐదేళ్లలో తిరుమలను అధ్వాన్నంగా మార్చారని మండిపడ్డారు.

తిరుమలలో అన్నదానం తీసుకొచ్చింది ఎన్టీఆరే..

ఎన్నో ఎన్నికలు చూశాం.. ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. నా కులదైవం వెంకన్న.. ఏ సంకల్పం చేసినా ఆయన్ను తలచుకుంటా అని పేర్కొన్నారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఘనవిజయం సాధించాం అని తెలిపారు. 2003లో స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించే సంప్రదాయం మొదలైందని గుర్తు చేశారు. అలిపిరి వద్ద క్లెమోర్‌ మైన్స్‌ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డా అని అన్నారు. రాష్ట్రానికి, జాతికి నేను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారని అన్నారు. తిరుమలలో అన్నదానం తీసుకొచ్చింది ఎన్టీఆరే అని పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు