Chandrababu : ఇండిపెండెన్స్ డే.. పెద్దలు మనకు నేర్పిన పాఠమీదే అంటూ సీఎం చంద్రబాబు స్పెషల్ ట్వీట్..!

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ప్రగతిపథంలో సాగుతున్న మన దేశం, ప్రపంచానికే ఆదర్శమన్నారు. ఏపీ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!
New Update

Chandrababu Tweet : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) 78వ స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా (Social Media) లో అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని పేర్కొన్నారు.

Also Read: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే.. షెడ్యూల్ ఇదే..!

వివిధ జాతులు, మతాలు, కులాలు కలిసి ఏకతాటిపై నడిచే అద్భుత దేశం మనదన్నారు. ఎప్పటికప్పుడు నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ప్రగతిపథంలో సాగుతున్న మన దేశం, ప్రపంచానికే ఆదర్శమన్నారు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుంటూ, పీడిత ప్రజలకు అండగా నిలుస్తూ, బలహీనులకు ధైర్యాన్నిస్తూ ముందుకు సాగాలనేది పెద్దలు మనకు నేర్పిన పాఠమన్నారు.

Also Read: పంద్రాగస్టు పండగ.. పదకొండోసారి ఎర్రకోట పై జెండా ఎగరేయనున్న ప్రధాని మోదీ 

అందుకు అనుగుణంగానే మనం అడుగులు వేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి ఫలాలను అందరికి అందించే బృహత్ బాధ్యతతో ముందుకు సాగుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం జనజీవితాలకు కొత్త వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటున్నానన్నారు.

#ap-tdp #chandrababu #independence-day
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe