CM Chandrababu: ఆగస్టు 1న శ్రీశైలానికి సీఎం చంద్రబాబు

AP: సీఎం హోదాలో తొలిసారి శ్రీశైలానికి వెళ్లనున్నారు చంద్రబాబు. ఆగస్టు 1న శ్రీశైలానికి వెళ్తారు. శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించనున్నారు. కృష్ణా నదికి జల హారతి ఇవ్వనున్నారు. అనంతరం శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రాన్ని సీఎం పరిశీలిస్తారు. 

New Update
AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!

CM Chandrababu: సీఎం హోదాలో తొలిసారి శ్రీశైలానికి వెళ్లనున్నారు చంద్రబాబు. ఆగస్టు 1న శ్రీశైలానికి వెళ్తారు. శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించనున్నారు. కృష్ణా నదికి జల హారతి ఇవ్వనున్నారు. అనంతరం శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రాన్ని సీఎం పరిశీలిస్తారు.

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

  • ఇన్ ఫ్లో : 4,42,441 క్యూసెక్కులు
  • ఔట్ ఫ్లో : 142,241 క్యూసెక్కులు
  • పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
  • ప్రస్తుతం : 882.50 అడుగులు
  • పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
  • ప్రస్తుతం : 201.5822 టీఎంసీలు
  • జలాశయం 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల
  • కుడి, గట్టు ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

హౌసింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..

సోమవారం హౌసింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఎంఐజీ లే అవుట్లను ఏర్పాటు చేస్తాం అని అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించి ఇస్తాం అని హామీ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు