/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/38_3b3acee04c.jpg)
CM Chandrababu: మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఈరోజు సాయంత్రం 4గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సీఎం భేటీ కానున్నారు. కాగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నికపై వారు చర్చించనున్నారు. కాగా సీఎం హోదాలో చంద్రబాబు హైదరాబాద్ కు రావడం ఇది రెండో సారి. తొలి పర్యటన విభజన చట్టాలపై సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ, ఏపీ తనకు రెండు కళ్ళు లాంటివని.. తెలంగాణలో కూడా తమ జెండా ఎగరవేస్తామని సీఎం చంద్రబాబు గతంలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.