CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో కీలక భేటీ!

AP: మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రేపు సాయంత్రం 4 గంటలకు గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం కానున్నారు. ఎల్లుండి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కాగా రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.

New Update
CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షాతో కీలక భేటీ!

CM Chandrababu: మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. రేపు సాయంత్రం 4 గంటలకు గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం కానున్నారు. ఎల్లుండి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. కాగా రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతున్న సంగతి తెలిసిందే.కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబబు ఢిల్లీకి వెళ్లనున్నారు.

రేపు మంత్రివర్గం భేటీ..

రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం. 

ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు..

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం కష్టమని భావిస్తోంది ఆర్ధికశాఖ. అందుకే ఇప్పుడున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్టును కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసింది. దాని ప్రకారం ఈ నెల 22వ తేదీ లేదా దాని తరువాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని అనుకుటోంది.

మరో నాలుగు నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తేవాలని ఏపీ ఆర్థిక శాఖ ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. ఆర్థిక వెసులుబాటు.. వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై క్లారిటీ రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు