/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/15.jpg)
CM Chandrababu:ఈరోజు అమరావతిలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. సీఎం హోదాలో తొలిసారిగా అమరావతికి రానున్నారు. కాగా ఇటీవల అమరావతి ఏపీకి రాజధాని అని చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సీఎం అయ్యాక చంద్రబాబు తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించగా.. రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుతో నిర్లక్ష్యానికి గురైన పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని వెళ్లి చూడనున్నారు.
చంద్రబాబు పర్యటన వివరాలు..
* ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు.
* తొలుత ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలిస్తారు.
* అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు.
* అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీలిస్తారు.
* ఐకానిక్ నిర్మాణాల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళతారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.