CM Chandrababu: నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు

నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటన మృతుల కుటుంబాలు.. గాయపడ్డవారిని పరామర్శించనున్నారు. అలాగే..పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

New Update
Skill Scam Case: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

CM Chandrababu: నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకోనున్నారు. నగరంలోని మెడికవర్‌ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్నారు. తర్వాత నేరుగా రాంబిల్లి మండలం ఫార్మాసిటీలో ఉన్న ఎసెన్షియా పరిశ్రమకు వెళ్లి.. ఘటనా స్థలాన్ని సందర్శిస్తారు. కాగా అచ్యుతాపురం ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం. ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదంపై కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిర్లక్ష్యం, ప్రాణాలకు వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

ప్రధాని మోదీ దిగ్బ్రాంతి..

అచ్యుతాపురం ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎం సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల పరిహారం ప్రకటన చేశారు.

17మంది మృతి..

అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో తీవ్ర విషాదం నెలకొల్పింది. అగ్నిప్రమాదం ఘటనలో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. 41 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విశాఖ, అనకాపల్లి ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

రూ. కోటి నష్టపరిహారం..

ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు విశాఖ జిల్లా కలెక్టర్ హరిందర్ ప్రసాద్. 41 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు