CM Chandrababu: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్డేట్

AP: రాష్ట్రంలో మరో పథకం అమలుకు కసరత్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై ఆర్టీసీ అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం. ఈ పథకం అమలుపై రేపు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

New Update
CM Chandrababu: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్డేట్

AP Free Bus Scheme: ఎన్నికల హామీలపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) కసరత్తు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఆర్టీసీ అధికారులు నివేదిక ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు రూ.250 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. తెలంగాణ, కర్నాటకలో ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

సోమవారం ఆర్టీసీ,రవాణా శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై రేపు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం. ఏపీలో రోజు 36-37 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 40 శాతం మంది అంటే.. 15 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో మాత్రమే ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఏపీలో కూడా ఇదే విధానం అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

తెలంగాణ (Telangana), కర్ణాటకల్లో (Karnataka) మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తున్నారు. ఆ టికెట్పై ఛార్జీ సున్నా అనే ఉన్నా.. టికెట్టిచ్చే యంత్రం (టిమ్)లో మాత్రం అసలు ఛార్జీ నమోదవుతుంది. ఇలా మహిళలకు జారీచేసిన సున్నా టికెట్ల మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్కించి.. రీయింబర్స్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారు.

తెలంగాణ, కర్ణాటకల్లో గతంలో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 65-70 శాతం ఉండగా.. మహిళలకు ఉచిత ప్రయాణ సదు పాయం కల్పించాక 95 శాతానికి చేరింది. ఏపీఎస్ ఆర్టీసీలో ఓఆర్ 69-70 శాతం మధ్య ఉంది. ఉచిత ప్రయాణం అమలైతే అది 95 శాతానికి చేరుతుందాని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటకల విధానమే ఇక్కడా అమ లుచేస్తే.. ఏపీఎస్ఆర్టీసీకి నెలకు రూ.250 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. టికెట్ల రూపంలో వచ్చే రాబడి, స్టూడెంట్, సీజనల్ పాస్లు.. తదితరాలన్నింటి రూపంలో ప్రతి నెలా ఆర్టీసీకి రాబడి తగ్గుతుంది.

Also Read: హోంమంత్రి రాజీనామా చేయాలి.. విజయసాయిరెడ్డి డిమాండ్

Advertisment
Advertisment
తాజా కథనాలు