CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు సర్కార్

AP: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. తాజాగా ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల బీమా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనిపై రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది.

New Update
CM Chandrababu: గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు సర్కార్

CM Chandrababu: ఏపీలో పసుపు జెండా ఎగరేసిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే పెన్షన్ పెంపు, ఉచిత ఇసుక పథకాలను అమలు చేసిన బాబు సర్కార్.. తాజాగా మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమైంది. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీపై కసరత్తు చేస్తోంది.

హామీపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. బీమా సౌకర్యంతో వైద్య సేవలు అందించే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ పేరుతో రూ. 5 లక్షల వరకు బీమా సేవలని కేంద్రం అందిస్తోంది. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల పరిమితికి కేంద్ర ప్రభుత్వం పెంచనుంది. కేంద్ర పరిమితితో కలుపుకొని రాష్ట్రంలో రూ.25 లక్షల వరకు పరిమితి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు