CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. నేడు మోదీతో కీలక భేటీ!

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది.

New Update
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. నేడు మోదీతో కీలక భేటీ!

CM Chandrababu: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది.అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉంది. కాగా ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీతో పాటు బీహార్ రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక నిధిని మంజూరు చేసింది. అందులో ఏపీకి రూ.15,000 కోట్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 

బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట..

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం.. అలాగే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీడీపీ మద్దతు కీలకం అవ్వడంతో ఈసారి చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పారనే చెప్పాలి. గత పదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి రాజధానితో పాటు కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక సాయం కింద రూ.15,000 కోట్లను కేటాయించింది.

అలాగే ఏపీ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంటుందని.. కేంద్రం సహాయం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. కాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పలు ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక డిమాండ్లకు ప్రధాని మోదీ ముందు పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి, జాతీయ రహదారులు వంటి కీలక అంశాలపై మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులంలను కలిసి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యేక హోదా లేదా?… 

లోక్ సభ సమావేశాల్లో కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకపోవడంపై ప్రతిపక్షాలు చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రంలో చక్రం తిప్పే స్థానంలో ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడడం లేదని అటు వైసీపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో వైసీపీ కేంద్రానికి తాకట్టు పెట్టినట్లు ఈసారి మీరు కూడా కేంద్రానికి ఏపీని తాకట్టు పెడుతున్నారా? బాబు గారు అంటూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఘాటుగా నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ఆమె అన్నారు. పోలవరం ప్రాజెక్ట్  పనులు వేగవంతం అయ్యేలా చూడాలని అన్నారు.

Also Read : సిద్ధిపేటలోఅర్ధరాత్రి హైడ్రామా.. హరీష్‌రావు ఆఫీస్‌పై దాడి!

Advertisment
Advertisment
తాజా కథనాలు