CM Chandrababu: నేడు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం

ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 3గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ నేతలతో భేటీ కానున్నారు. ఈరోజు కొత్త టీపీసీసీ అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

New Update
CM Chandrababu: నేడు తెలంగాణ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం

CM Chandrababu: సీఎం చంద్రబాబు మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇప్పటి వరకు హైదరాబాద్ కు రెండు సార్లు వచ్చారు చంద్రబాబు. ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో టీ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి, తెలంగాణలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈరోజు కొత్త టీపీసీసీ అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

జై తెలంగాణ అంటూ..

ఇటీవల హైదరాబాద్ లో పర్యటించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తమ పార్టీ జెండా ఎగురవేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టీడీపీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  తెలంగాణ గడ్డమీద మళ్ళీ తెలుగుదేశానికి పునర్వైభవం వస్తుందని అన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆంధ్రలో 2019 నుండి 2023 వరకు జరిగిన పాలనలో ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. మొన్న ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకుంటే, అభివృద్ధిలో తెలంగాణ తో పోల్చుకుంటే 100 శాతం వెనక్కి ఏపీ ఉండేదని చెప్పారు. మోదీ చెబుతున్నట్టు 2047 వరకు వికసిత్ భారత్ ప్రపంచంలో నంబర్ వన్ గా ఉంటుందని తెలిపారు. జై తెలంగాణ అంటూ సమావేశాన్ని ముగించారు.

రెండు కళ్ళు..

ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని చంద్రబాబు అన్నారు. తనకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అని చెప్పారు. ఎన్టీఆర్‌ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఆయన అని కొనియాడారు. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదల్లేదని చెప్పారు. పార్టీ నుంచి నాయకులు తప్ప కార్యకర్తలు వెళ్లలేదని వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఉన్నంతవరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని అన్నారు.

Also Read : మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీలు ఎందుకు లేరు–రాహుల్ గాంధీ

Advertisment
తాజా కథనాలు