AP Pensions: చంద్రబాబు సర్కార్‌కు దొంగ పెన్షనర్లు షాక్

ఏపీలో భారీగా బోగస్‌ పెన్షన్లు గుర్తించారు. ఇప్పటి వరకు రెండున్నర లక్షల బోగస్‌ పెన్షన్లు పంపిణీ జరిగినట్లు అధికారులు తెలిపారు. పెన్షన్లలో అక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. అర్హత లేకున్నా కొందరు పెన్షన్లను పొందుతున్నారని ఫిర్యాదు రావడంతో సీఎం సీరియస్ గా తీసుకున్నారు.

AP Pensions: చంద్రబాబు సర్కార్‌కు దొంగ పెన్షనర్లు షాక్
New Update

AP Pensions: ఏపీలో భారీగా బోగస్‌ పెన్షన్లు గుర్తించారు. ఇప్పటి వరకు రెండున్నర లక్షల బోగస్‌ పెన్షన్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. పెన్షన్లలో అక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ఆధార్‌లో వయసు మార్చుకుని వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగులు కాకపోయినా దివ్యాంగుల పెన్షన్లు, ఒంటరి మహిళ కాకకపోయినా వితంతు పెన్షన్లు.. ఇలా అన్ని రకాలుగా అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. అర్హులైన వారికి మాత్రం పెన్షన్ల రాకుండా ఆపినట్లు గుర్తించారు. బాధ్యులైన అధికారులను ప్రభుత్వం గుర్తిస్తోంది. పెన్షన్లలో అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మండల స్థాయిలో పెద్ద సంఖ్యలో సస్పెన్షన్లు ఉండే అవకాశం ఉంది.

#ap-pensions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe