Chandrababu: బాబు నోట 'జై తెలంగాణ'.. హైదరాబాద్ గడ్డపై చంద్రబాబు సంచలన ప్రకటన!

AP: జై తెలంగాణ అంటూ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ గడ్డమీద మళ్ళీ తెలుగుదేశానికి పునర్వైభవం వస్తుందని అన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆంధ్రలో 2019 నుండి 2023 వరకు జరిగిన పాలనలో ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు.

Chandrababu: బాబు నోట 'జై తెలంగాణ'.. హైదరాబాద్ గడ్డపై చంద్రబాబు సంచలన ప్రకటన!
New Update

CM Chandrababu: హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ గడ్డమీద మళ్ళీ తెలుగుదేశానికి పునర్వైభవం వస్తుందని అన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఆంధ్రలో 2019 నుండి 2023 వరకు జరిగిన పాలనలో ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. మొన్న ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకుంటే, అభివృద్ధిలో తెలంగాణ తో పోల్చుకుంటే 100 శాతం వెనక్కి ఏపీ ఉండేదని చెప్పారు. మోదీ చెబుతున్నట్టు 2047 వరకు వికసిత్ భారత్ ప్రపంచంలో నంబర్ వన్ గా ఉంటుందని తెలిపారు. జై తెలంగాణ అంటూ సమావేశాన్ని ముగించారు.

ఏపీలో విజయానికి తెలంగాణ టీడీపీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారని చంద్రబాబు అన్నారు. తనకు ఏపీ, తెలంగాణ రెండు కళ్లు అని చెప్పారు. ఎన్టీఆర్‌ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. సంక్షేమానికి నాంది పలికిన నాయకుడు ఆయన అని కొనియాడారు. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీ వదల్లేదని చెప్పారు. పార్టీ నుంచి నాయకులు తప్ప కార్యకర్తలు వెళ్లలేదని వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఉన్నంతవరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని అన్నారు.

సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. తనను జైల్లో పెట్టినపుడు టీడీపీ శ్రేణులు చూపించిన చొరవ మరువలేనిది అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తన అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినట్లు చెప్పారు. ఆ సమయంలో గచ్చిబౌలిలో నిర్వహించిన సభను నేను మరిచిపోలేను అని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌లో తనకు మద్దతుగా నిర్వహించిన ఆందోళనలను టీవీలో చూసి గర్వపడినట్లు చెప్పారు.

#cm-chandrababu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe