CM Chandrababu: విభజన వల్ల ఏపీకి భారీ నష్టం జరిగింది.. దానిపై ఇంకా క్లారిటీ లేదు! రాష్ట్ర విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రం బడ్జెట్ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అసెంబ్లీ వేదికగా తెలిపారు. అన్ని ఇబ్బందులను అధిగమించి ఏపీని నెంబర్-1 స్థానంలో నిలిపే దిశగా తమ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. By srinivas 23 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP News: రాష్ట్ర విభజన వల్ల ఏపీకి భారీగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) అన్నారు. గత ఐదేళ్ల పాలన వల్ల ఏపీ రాజధాని ఏమిటో క్లారిటీ లేకపోవడం కూడా రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా మారిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికి పరిస్థితులపై మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రం బడ్జెట్ కూడా పెట్టుకోలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పారు. ప్రజలు విసుగెత్తిపోయారు.. ఈ మేరకు రాష్ట్రంలో ఆర్థిక గందరగోళ పరుస్థితులు చక్కదిద్ది మరో రెండు నెలల తర్వాత బడ్జెట్ (AP Budget) పెట్టుకునే పరిస్థితి ఉంది. ఇబ్బందులను అధిగమించి ఏపీని నెంబర్-1 స్థానంలో నిలపాలన్నారు. గత ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని, 90 వేలకు పైగా మెజార్టీలు ఇందుకు సాక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా ఏపీలో అత్యధిక మెజార్టీ సాధించిన గాజువాక ఎమ్మెల్యే పల్లాకు అభినందనలు తెలిపారు. అలాగే పవన్ క్లిష్ట సమయంలో కీలకంగా వ్యవహరించారని, రాష్ట్రం కోసం టీడీపీ-జనసేన కలిసే పోటీ చేస్తాయని చెప్పిన గొప్ప వ్యక్తి పవన్ అంటూ కొనియాడారు. ఇది కూడా చదవండి: AP Assembly: ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులకు ఆమోదం ఓట్లు చీలకూడదు.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని పవన్ (Pawan Kalyan) సామాజిక బాధ్యతతో ఆలోచించారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించేందుకు సమైక్యంగా పని చేస్తాం. ఖర్చు పెట్టుకుని దూర ప్రాంతాల నుంచి కూటమికి ఓట్లేసి వెళ్లారు. గత ఐదేళ్లల్లో ప్రజలకు నరకం అంటే ఏంటో చూపించారు. మెడ మీద కత్తి పెట్టి భూములు, ఆస్తులు రాయించుకున్నారు. ఆడబిడ్డల మాన, ప్రాణాలకు రక్షణ లేదు. సభలో ఉన్న సగం మంది ప్రత్యక్షంగా.. మరి కొంతమంది పరోక్షంగా గత ప్రభుత్వ బాధితులే. స్పీకర్ అయ్యన్న లాంటి వ్యక్తి మీదే అత్యాచార యత్నం కేసు పెట్టారంటే బాధేస్తోంది. అచ్చెన్నాయుడు, నారాయణ వంటి వారిని గత ప్రభుత్వం విపరీతంగా హింసించిందంటూ వైసీపీపై విమర్శలు గుప్పించారు. #chandrababu-naidu #ap-assembly-sessions-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి