/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu.jpg)
White Paper On AP Power Sector:ఏపీలో విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు (CM Chandrababu). వాస్తవాలు ప్రజలకు తెలిసేందుకే ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఏ శాఖ చూసిన తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. తవ్వినకొద్దీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుస్తోందని అన్నారు. విద్యుత్‌తో.. ప్రతి ఒక్కరి జీవతం ముడిపడి ఉందని చెప్పారు. విద్యుత్‌తోనే ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. 2014లో అధికారంలోకి వచ్చే సరికి విద్యుత్ కొరత ఉందని తెలిపారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని పిలుపునిచ్చాం అని అన్నారు. ప్రజలు గెలిచి మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారని తెలిపారు.