CM Chandrababu: సీఎం చంద్రబాబుతో బెల్జియం బృందం భేటీ

AP: సీఎం చంద్రబాబుతో బెల్జియం బృందం భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలపై సీఎంతో చర్చించారు. ఏపీలో వ్యాపార వర్గాలకు అనుకూల వాతావరణం సృష్టిస్తామని చంద్రబాబు అన్నారు.

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో బెల్జియం బృందం భేటీ
New Update

CM Chandrababu: బెల్జియం దేశానికి చెందిన వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధుల బృందం నేడు ఏపీ రాజధాని అమరావతి విచ్చేసింది. భారత్ లో బెల్జియం రాయబారి దిదీర్ వాండెర్ హాసెల్ట్ నేతృత్వంలో వచ్చిన బెల్జియం బృందం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. దీనిపై సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

"బెల్జియం రాయబారి వాండెర్ హాసెల్ట్ నాయకత్వంలో వచ్చిన వాణిజ్య, పరిశ్రమల ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యాను. ఏపీలో వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉండే వాతావరణాన్ని సృష్టించేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తున్నాం" అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ మేరకు బెల్జియం బృందంతో సమావేశం తాలూకు ఫొటోలను కూడా చంద్రబాబు పంచుకున్నారు.

#chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe