AP News: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి సీఎం చంద్రబాబు!

ఏపీ నుంచి లద్దాక్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కాబోతున్న చీఫ్ జస్టిస్ శ్రీధర్ సింగ్ ఠాకూర్ ను సీఎం చంద్రబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. స్వయంగా ఠాకూర్ నివాసానికి వెళ్లి పలు అంశాలపై చర్చించారు. గతేడాది జులై 24న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు ఠాకూర్.

New Update
AP News: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి సీఎం చంద్రబాబు!

Vijayawada: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవలే ఠాకూర్ ను లద్దాక్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. కాగా ఠాకూరు బదిలీపై వెళ్లనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఠాకూర్ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

publive-image

ఇక గతేడాది జులై 24న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఠాకూర్.. ప్రస్తుతం ధీరజ్ సింగ్ బదిలీ కావడంతో కొత్త చీఫ్ జస్టిస్ ఎవరు నియామకంపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి పలువురు అధికారులు బదిలీ అవుతున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారన్న కారణంతో పలు శాఖల్లో ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లోని అధికారులను బదిలీ చేస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు