/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Chandrababu-Naidu-jpg.webp)
Palla Srinivas As AP TDP President:సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావు పేరును చంద్రబాబు ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అచ్చెన్నాయుడు స్థానంలో పల్లా శ్రీనివాస్‍కు చంద్రబాబు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గాజువాకలో 95,235 ఓట్లతో టీడీపీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారు. దీనిపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
కాగా ఏపీలో మరోసారి టీడీపీ పార్టీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు కేబినెట్ లో ప్రస్తుతం ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడికి చోటు దక్కింది. అచ్చెన్నాయుడికి వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక మంత్రిత్వ శాఖను కేటాయించారు చంద్రబాబు. కాగా రాష్ట్ర విభజన సమయం నుంచి రాష్ట్ర అధ్యక్షడి బాధ్యతలను బీసీ వర్గానికి చెందిన వారికే ఇస్తున్నారు చంద్రబాబు. తాజాగా మరోసారి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ రావు దక్కింది.
Also Read: పవన్ కు పంచాయతీ రాజ్, లోకేష్ కు ఐటీ.. ఏపీ మంత్రుల శాఖలివే!