CM Chandrababu: గ్రామ సచివాలయాల్లో మార్పులపై ఏపీ సర్కార్ ఫోకస్ చేస్తోంది. వైసీపీ హయాంలో ఏర్పాటైన సచివాలయాలను కొనసాగిస్తూనే సిబ్బంది సేవల విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.
Also Read: సంచలనంగా కోల్‌కతా డాక్టర్ కేసు.. కీలకంగా మారిన సీసీ ఫుటేజ్.. ఆ 29 నిమిషాల్లోనే…
గ్రామ, వార్డు సచివాలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయాల సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఒక్కో సచివాలయంలో 10 నుంచి 14 మంది ఉద్యోగులు ఉండగా.. నలుగురు ఉద్యోగులను మాత్రమే ఉంచి.. మిగతా శాఖల్లో ఇతరులను సర్దుబాటు చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది.
Also Read: నిందితుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు!
ముందుగా ఇరిగేషన్ శాఖలో AEలుగా 660 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. దశలవారీగా మిగతా ఉద్యోగులు కూడా వేరే శాఖల్లోకి తరలించనుంది. ప్రస్తుతం 15 వేల సచివాలయాల్లో లక్షా 26 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.