AP Government : వైసీపీ కోసం పని.. ప్రభుత్వం నుంచి జీతాలు.. వెలుగులోకి భారీ కుంభకోణం?

AP: గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రజాధనం దుర్వినియోగంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. వైసీపీకి పని చేయించుకుని ప్రభుత్వం నుంచి వేల మందికి లక్షల్లో జీతాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు సిద్ధమైంది.

New Update
AP Government : వైసీపీ కోసం పని.. ప్రభుత్వం నుంచి జీతాలు.. వెలుగులోకి భారీ కుంభకోణం?

CM Chandrababu Focus On YCP Scams : వైసీపీ హయాంలో అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ప్రజాధనం దుర్వినియోగంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. వైసీపీ (YCP) కి పని చేయించుకుని ప్రభుత్వం నుంచి వేల మందికి లక్షల్లో జీతాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డవల్మెంట్ కార్పొరేషన్‌ (AP Skill Development Corporation) ఈ ప్రగతి, RTG విభాగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఐదేళ్లు ఆఫీసుకు రాకుండానే చాలా మందికి జీతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి జీతం - పార్టీ కోసం సోషల్ మీడియాలో పని చేసినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.

నాటి అక్రమ నియామకాలు, చెల్లింపులపై సమగ్ర వివరాలు ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో అవుట్ సోర్సింగ్ పేరుతో జరిగిన అక్రమాలపై నివేదికలు తీసుకుంది. అసలు ఉద్యోగులే లేకుండా జీతాలు డ్రా చేయడం ఎక్కడెక్కడో ఉన్నవారి పేర్ల మీద జీతాలు ఇవ్వడంపై ఆరా తీస్తోంది. ఈ వ్యవహారంపై చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అన్న అంశంపై ఏపీ పాలిటిక్స్ (AP Politics) లో ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అనేక మంది పేర్లు ఈ వ్యవహారంలో బయటకు వచ్చే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది.

Also Read : జగన్ కు బిగ్ షాక్.. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే జంప్?

Advertisment
తాజా కథనాలు