CM Chandrababu Conference With District Collectors : పాఠశాలల్లో ఎక్కడా టీచర్స్ (Teachers) కొరత లేకుండా చూడాలని, అవసరమైతే విద్యా వాలంటీర్ల (Education Volunteers) ను నియమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యా నాణ్యత దెబ్బ తినకూడదు. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్నింటకీ వాలంటీర్లను తీసుకోండి.
పాఠశాల విజ్ఙాన, విహారయాత్రలు, క్రీడలు నిర్వహించాలి. పిల్లలు ఒత్తిడి లేకుండా ఆనదంగా చదువకునే పరిస్థితి రావాలి అని సూచించారు. మొదట అందరూ పాఠశాలకు రావాలి. ఆ తరువాత ప్రభుత్వ బడులకు ఎలా తీసుకురావాలి అనేది ఆలోచించవచ్చు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఎక్కడో చోట బడిలో ఉండాలి.
కాంట్రాక్టర్లు ఏకరూప దుస్తులను సరఫరా చేయలేకపోతే ఆ పరిమాణాన్ని మిగతా కాంట్రాక్టర్లకు సమానంగా పంచాలి. ఆలస్యం కాకుండా చూసుకోవాలి. విద్యార్థులకు శాశ్వత అకడమిక్ నంబర్ ఇచ్చేలా చూడాలని తెలిపారు.
Aslo read: విరిగిపడిన కొండచరియలు..13 మంది మృతి!