AP: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త.. జోన్నలు, సజ్జలు, రాగులతో పాటు.. రేషన్ దుకాణాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 6 వేల మంది రేషన్ డీలర్ల నియామకాల్ని భర్తీ చేస్తామని.. ధాన్యం సేకరణకు కొత్త విధానం తెస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు నాటికి ఏర్పాట్లు పూర్తిచేసి అక్టోబరులో సేకరణ ప్రారంభిస్తామన్నారు. By Jyoshna Sappogula 06 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP Ration Shops: రేషన్ దుకాణాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ నుంచి పంచదార పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. 6 వేల మంది రేషన్ డీలర్ల నియామకాల్ని త్వరలో భర్తీ చేస్తామని..ధాన్యం సేకరణకు కొత్త విధానం తెస్తున్నామని అన్నారు. సెప్టెంబరు నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి అక్టోబరులో ధాన్యం సేకరణ ప్రారంభిస్తామన్నారు. ఈ క్రమంలోనే ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లోనే సొమ్ము చెల్లించాలని చంద్రబాబు ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని సమీప మిల్లులకే పంపాలని సూచించారు. Also Read: హైదరాబాద్‌లో మిస్సయిన బాలుడు.. తిరుపతి రైల్వేస్టేషన్‌లో ఒంటరిగా.. వైసీపీ ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్, రైస్‌మిల్లర్ల అసోసియేషన్, ఎమ్మెల్యే పదవులన్నీ కాకినాడలోని ఒకే కుటుంబం చేతుల్లోకి చేరాయని.. దొంగ చేతికి తాళాలిచ్చారని అన్నారు. కూరగాయలను ఆర్టీసీ బస్సుల ద్వారా రైతుబజార్లకు తరలించాలన్నారు. ధరలు నియంత్రించాలని.. మన ప్రభుత్వ చర్యల వల్ల కందిపప్పు ధర 40 రోజుల్లో 2% తగ్గిందన్నారు. ఇళ్ల వద్దకే రేషన్ సరకుల సరఫరా కోసం రూ.1,800 కోట్లతో కొన్న వాహనాలు నెలలో సగం రోజులు ఖాళీగా ఉంటున్నాయన్నారు. వాటి డ్రైవర్లూ కూడా ఖాళీగానే ఉంటున్నారని.. ఇకపై దుకాణాలకు రాలేని వారికి మాత్రమే ఇంటికెళ్లి రేషన్ ఇవ్వాలన్నారు. #ap-cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి