Amaravati : సీఎం చంద్రబాబు (CM Chandrababu) రేపు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని ఉ.11 గంటలకు పరిశీలించనున్నారు. గత ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచే చంద్రబాబు పర్యటన చేయనున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్, ఆలిండియా సర్వీస్ (All India Services) అధికారులు, జడ్జిల క్వార్టర్స్ పరిశీలించనున్నారు. కాగా, 2015లో ఉద్దండరాయుడిపాలెంలో రాజధానికి చంద్రబాబు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే, 2019లో టీడీపీ (TDP) ఓటమి చెందింది.
Also Read: జగన్ కు బిగ్ షాక్.. జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే జంప్?
ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ (YCP) ప్రభుత్వం మూడు రాజధానులంటూ అమరావతిని పక్కనపెట్టింది. దీంతో చంద్రబాబు శంకుస్థాపన చేసిన పనులు సగంలోనే ఆగిపోయాయి. 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో ఏపీ రాజధాని అమరావతికి పూర్వవైభవం వచ్చింది. సీఎం చంద్రబాబు మళ్లీ రాజధానిపై ఫోకస్ పెట్టారు. అమరావతిని రాజధానిగా చేయడం తమ బాధ్యత అని ప్రజలకు భరోసా కల్పించారు.