Shamshabad lady murder:శంషాబాద్ మహిళా మర్డర్ కేసులో క్లూ చిక్కుతోంది..మృతురాలిని గుర్తించిన పోలీసులు!

సంచలనం రేపిన శంషాబాద్ మహిళా మర్డర్ ఇంకా పెట్రోల్ పోసి తగులబెట్టిన కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సాక్ష్యాధారాలను సీసీ టీవీ ఫుటేజీల ద్వారా సేకరిస్తున్నారు. ఈక్రమంలో దర్యాప్తులో.. శంషాబాద్ పోలీసులు పురోగతిని సాధించారు. దారుణంగా హత్యకు గురై.. తగులబెట్టబడిన మహిళను గుర్తించడం జరిగింది...

Shamshabad lady murder:శంషాబాద్ మహిళా మర్డర్ కేసులో క్లూ చిక్కుతోంది..మృతురాలిని గుర్తించిన పోలీసులు!
New Update

Shamshabad lady murder: సంచలనం రేపిన శంషాబాద్ మహిళా మర్డర్ ఇంకా పెట్రోల్ పోసి తగులబెట్టిన కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సాక్ష్యాధారాలను సీసీ టీవీ ఫుటేజీల ద్వారా సేకరిస్తున్నారు. ఈక్రమంలో దర్యాప్తులో.. శంషాబాద్ పోలీసులు పురోగతిని సాధించారు. దారుణంగా హత్యకు గురై.. తగులబెట్టబడిన మహిళను గుర్తించడం జరిగింది.

పోలీసులు ప్రకారం.. హత్యకు గురైన మహిళ దొడ్డి గ్రామానికి చెందిన 48 ఏళ్ళ మంజుల. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. కాగా, ఈ నెల 10 వ తేదీ ఉదయం తనకు కడుపు నొప్పిగా ఉందని.. ఆసుపత్రికెళ్లి చూపించుకుంటానని ఆమె ఇంటి నుంచి బయల్దేరింది. అయితే చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో ఆమె చుట్టాల ఇంటికెళ్లి ఉంటుందని కుటుంబసభ్యులు భావించారు.

కాగా, 11 వ తేదీన కూడా తిరిగి రాకపోవడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆమెను శంషాబాద్ లోని సాయి ఎన్ క్లేవ్ లో ఇళ్ల స్థలాల మధ్యే దుండగులు పెట్రోల్ పోసి తగలపెట్టాడు. అయితే ఆమెను ఎక్కడో హత్య చేసి.. తరువాత సాయి ఎన్ క్లేవ్ కాలనీకి తీసుకొని దహనం చేశారు దుండగులు. ఇక స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అయితే జనావాసాల మధ్యే ఈ దారుణం చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. దగ్గర్లోనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఇంకా మెయిన్ రోడ్ ఉండడం.. ఇరవై నాలుగు గంటల పాటు పోలీస్ బండ్ల హారన్లు మోగుతుండే నేపథ్యంలో దుండగులు ఇంతటి సాహసానికి ఎలా తెగబడ్డారనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరో వైపు పోలీసులు పది ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

ముఖ్యంగా సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా క్లూస్ ను రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దుండగులకు మృతురాలు మంజులకు ముందు నుంచి పరిచయాలున్నాయా.. లేక ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హతమార్చారా.. అన్న కోణంలో పోలీసులు ఇన్వెష్టిగేషన్ సాగిస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి