సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు రెండో రోజు వైద్య పరీక్షలు

భట్టి పాదయాత్రకు స్వల్ప బ్రేక్ పడింది. నిన్న వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన భట్టి.. ఈరోజు కూడా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. త్వరలోనే కోలుకుంటానని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.

New Update
సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు రెండో రోజు వైద్య పరీక్షలు

CLP leader Bhatti Vikramarka suffered from sunburn

టెన్షన్‌ ఏం లేదు..

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వడదెబ్బ కారణంగా మంగళవారం స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. భట్టికి ఈరోజు కూడా సూర్యాపేటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్ష చేశారు. వడదెబ్బ కారణంగా జ్వరం రావడంతో పాటు బాడీ డిహైడ్రేషన్ కావడం వల్ల భట్టి విక్రమార్కకి చాలా నీరసంగా ఉందని డాక్టర్ తెలిపారు.

కోలుకుంటున్నా..

భట్టికి జ్వరము, నీరసం తగ్గడానికి చికిత్స చేస్తున్నట్టు చెప్పారు. బాడీ డిహైడ్రేషన్ కావడం వల్ల త్వరగా కోలుకోవడానికి సెలైన్ పెట్టినట్లు వెల్లడించారు. భట్టి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఆయన అభిమానులు తరలివచ్చి పరామర్శిస్తున్నారు. 100 డిగ్రీల జ్వరంలోనూ నీరసంగా ఉన్నప్పటికీ భట్టి తనను చూడడానికి పరామర్శించడానికి వచ్చిన కార్యకర్తలు, అభిమానులను కలిసి ఎలాంటి దిగులు, ఆందోళన చెందవద్దని, తాను త్వరలోనే కోలుకుంటానని వారికి ధైర్యం చెప్పి పంపారు.

పాదయాత్రకు బ్రేక్

మరోవైపు .. భట్టి నిర్వహిస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కేతపల్లి మీదుగా సాగుతోంది. నిన్న 97వ రోజు పాదయాత్రలో భాగంగా కేవలం ఆరున్నర కిలోమీటర్లు మాత్రమే ఆయన నడిచారు. ఈ లోపు అస్వస్థతకు గురైయ్యారు. అనతరం భట్టికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల సూచన మేరకు భట్టి విక్రమార్క తన పాదయాత్రకు విరామం ప్రకటించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు