K.J.Yesudasu: గాన గంధర్వన్ పుట్టినరోజు నేడు

శాస్త్రీయ సంగీత కళాకారుడు, గాన గంధర్వన్, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ కే.ఎస్. యేసుదాస్ 84వ పుట్టినరోజు నేడు. 50 ఏళ్ల కెరీర్ లో అంతర్జాతీయ స్థాయిలో లక్షకుపైగా పాటలు పాడిన ఆయనకు నలభైకి పైగా అవార్డులు దక్కాయి. 'హరివరాసనం విశ్వమోహనం' ఎవర్ గ్రీన్ సాంగ్.

K.J.Yesudasu: గాన గంధర్వన్ పుట్టినరోజు నేడు
New Update

K.J.Yesudasu: భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు, గాన గంధర్వన్ (Gaana Gandharvan), ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్.. కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్ నేడు 84వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలతోపాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ, భక్తిగీతాలతో కలుపుకుని దాదాపు లక్షకుపైగా పాటలు పాడిన సింగింగ్ లెజెండ్.. ఇంకా తన మధురమైన గాత్రంతో అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.

50 ఏళ్ల కెరీర్..
1940 జనవరి 10న కేరళ లోని కొచ్చిలో ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించిన యేసుదాస్.. 50ఏళ్ల కెరీర్ లో పద్మశ్రీ, పద్మ భూషణ్, ఏడు జాతీయ పురస్కారాలు, ఉత్తమ నేపథ్య గాయకుడిగా నాలుగు నంది అవార్డులతోపాటు ఫిలిం ఫేర్ వంటి దాదాపు నలభైకిపైగా పురస్కారాలు అందుకున్నారు. అంతేకాదు ఒకే రోజు నాలుగు భారతీయ భాషల్లో 16 సినిమా పాటలు పాడి ఔరా అనిపించారు.

'హరివరాసనం విశ్వమోహనం'..
ఇక ఈయన పాడిన అయ్యప్ప పవళింపు సేవ గీతం 'హరివరాసనం విశ్వమోహనం'వింటే చాలు మనసు పులకరించిపోతుంది. శబరిమల ఆలయంలో స్వామివారికి రోజూ పవళింపు సేవ సమయంలో ఇప్పటికీ ఈ మహా గాయకుడు పాడిన జోలపాటనే వినిపిస్తుండటం విశేషం. ఆల్ ఇండియా రేడియో ప్రత్యేక సంగీతార్థనను కేరళ అంతటా ప్రసారం చేసింది. అనేకమంది ప్రఖ్యాత గాయకులు ఈ పాటను విభిన్న పద్ధతులలో పాడినప్పటికీ, శబరిమల ప్రతిరోజూ హరివారణానం కోసం యేసుదాస్ స్వరాన్ని అధికారికంగా ఉపయోగిస్తుండటం విశేషం.

ఇది కూడా చదవండి : Delhi High court : భర్తలపై నిందలుమోపే భార్యలకు షాక్.. ఇకపై ఆటలు చెల్లవు

'జాతి భేదం మత ద్వేషం'..
దర్శకుడు ఎ.కె.ఆంథోనీ 1961లో ఓ సినిమాలో యేసుదాసుకు మొట్టమొదటిగా అవకాశం ఇవ్వగా.. ఆయన పాడిన 'జాతి భేదం మత ద్వేషం'భారీ పాపులారిటీ పొందింది. అయితే సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆయన గొంతు సినిమా పాటలకు పనికిరాదని చాలామంది తిరస్కరించారు. కానీ ఆయన మాత్రం వేదికల మీద, కార్యక్రమాల్లో పాటలు పాడుతూ అవకాశాలు దక్కించుకున్నాడు. దర్శకుడు సేతు ఇయాన్‌ దర్శకత్వంలో వచ్చిన 'పార్త విళి పార్తబడి'సినిమాలో అతను రెండు భిన్నమైన స్వరాలతో పాట పాడి ప్రేక్షకులను మంత్రముగ్గుల్ని చేయగా యేసుదాసుకు తిరుగులేకుండాపోయింది.

'జై జవాన్ జై కిసాన్'.. 
అలాగే హిందీలో మొదటిపాట 'జై జవాన్ జై కిసాన్'సినిమాలో పాడగా.. 'చోటీ సి బాత్'లో ఆలపించిన 'జనేమాన్ జనేమాన్'సాంగ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే అమితాబ్ బచ్చన్, అమోల్ పాలేకర్, జీతేంద్రతో సహా హిందీ సినిమాలోని పలువురు ప్రముఖ నటుల కోసం పాడిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి.

ఇది కూడా చదవండి : Food Coma: ఫుడ్‌ కోమా అంటే తెలుసా..ఎలాంటి నష్టాలు ఉంటాయి..?

ఒకే కులం, ఒకే దేవుడు..
ఇక 2009లో యేసుదాస్ 'మ్యూజిక్ ఫర్ పీస్' అనే నినాదంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సంగీత ప్రచారాన్ని ప్రారంభించారు. నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని ఆయన గాఢంగా విశ్వసిస్తారు. మహ్మద్ రఫీ, చెంబై వైద్యనాథ భగవతార్, బాలమురళి కృష్ణ లను అతను ఎక్కువగా ఆరాధిస్తారు. జ్ఞానం, సంగీతం, కళల దేవత అయిన సరస్వతి దేవి కీర్తనలను పాడటానికి యేసుదాస్ తన పుట్టినరోజున కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా ఆలయాన్ని సందర్శిస్తుంటారు. 2000లో అతని 60 వ పుట్టినరోజున సంగీత ఉత్సవం ప్రారంభమవగా.. ప్రతి జనవరిలో కొల్లూరు మూకాంబికా ఆలయంలో తొమ్మిది రోజుల సంగీత ఉత్సవం జరుపుతారు. 2010 జనవరి 10 ఆదివారం కొల్లూరు శ్రీ మూకాంబికా ఆలయంలో తన 70వ పుట్టినరోజు (సప్తతి)ను 'సంగీతార్థన'శాస్త్రీయ భక్తి పాటలతో పాటు, 70 మంది గాయకులతో పాటు మూకాంబికా దేవత ముందు జరుపుకున్నారు.

#birthday #k-j-yesudasu #classical-music-artist
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి