Indore: నాలుగో తరగతిలో పిల్లలేం చేస్తారు? క్లాసు ఎప్పుడొదిలేస్తారా, గ్రౌండ్ లోకి పరుగులెప్పుడు తీద్దామా అని ఎదురుచూస్తూంటారు. అదే కదా మనకు తెలిసింది. కానీ, ఈ పిల్లలు చూడండి.. క్లాసులో చిన్న గొడవైందని కోపం పెంచుకున్న నాలుగో తరగతి పిల్లలు ముగ్గురు కలిసి స్కూల్ లో మరో పిల్లాడిపై జామెట్రీ కంపాస్ పరికరాలతో దాడిచేశారు. ఒకటీ రెండూ కాదు.. ఒంటిపై మొత్తం 108 పోట్లు పొడిచారు. పైగా వాళ్లంతా పదేళ్లలోపు వయస్సున్న చిన్నారులే. మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో జరిగింది ఈ ఘటన. బాలల సంక్షేమ సంఘం ఈ ఘటనను పరిశీలించి విచారించవలసిందిగా పోలీసులకు సూచించింది.
ఇది కూడా చదవండి: జర్నలిస్టు సౌమ్య హత్య కేసు.. అడిషనల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు
‘‘ఈ ఘటన దిగ్భ్రాంతిని కలిగించింది. ఇంత చిన్న వయస్సులో పిల్లల్లో హింసాత్మక ప్రవర్తనకు కారణాన్ని తెలుసుకునేలా పోలీసుల దర్యాప్తును కోరాము’’ అని బాలల సంక్షేమ సంఘం (CWC) చైర్ పర్సన్ పల్లవీ పోర్వాల్ చెప్పారు. ఘటనలో భాగస్వాములైన చిన్నారులు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిందని చెప్పారు. హింసాత్మక సన్నివేశాలున్న వీడియో గేమ్ ల ప్రభావం పిల్లలపై ఉందా అన్న కోణంలోనూ విచారణ జరపాలని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇండస్ట్రీని కుదిపేస్తున్న అలియ బోల్డ్ వీడియో.. ఏకంగా బెడ్ రూమ్ లోనే
బాధిత విద్యార్థి ఒంటిపై గాయాలను గమనించిన తండ్రి స్కూల్ యాజమాన్యాన్ని ఈ విషయమై సంప్రదించారు. వివరణ అడిగినప్పటికీ, వారు తరగతి గదిలోని సీసీటీవీ ఫుటేజీని అందించలేదన్నారు. స్థానిక ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఆయన ఫిర్యాదు చేశారు.
చిన్నారుల్లో ఇలాంటి హింసాత్మక ఘటనలు ఇటీవల బాగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆన్లైన్ గేమ్ లు, అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ చిన్నారుల్లో ఇలాంటి ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. వీలైనంత వరకూ పిల్లలను వాటికి దూరంగా ఉంచాలని, వారి చేష్టలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.