Prakasham: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో TDP - JSP మధ్య ముసలం మొదలైంది. నియోజకవర్గంలో పెత్తనం కోసం తెలుగు తమ్ములు.. జనసైనికుల మధ్య వైరం మరింత ముదురుతోంది. ఈసారి ప్రభుత్వ ఫలాలు మాకే అంటున్నారు టీడీపీ శ్రేణులు. అయితే, నియోజకవర్గంలో YCP మెజారిటీ తగ్గటానికి తామే కారణం అంటున్నారు జనసేన శ్రేణులు. విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒకరి సమావేశానికి మరొకరు గైర్హాజరవుతున్నారు.
Also Read: జగన్ కు షాక్.. ఆ ముగ్గురు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జంప్..!
నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జీ ఎరీక్షన్ బాబు (Erikson Babu) పెత్తనం చేస్తుండడంతో జనసైనికులు సాహించలేకపోతున్నట్లు తెలుస్తోంది. మొన్న టీడీపీ శ్రేణులు సమావేశం కాగా.. నేడు జనసేన (Janasena) శ్రేణులు సమావేశం అయ్యారు. నియోజకవర్గంలో పట్టుకోసం ఇరు పార్టీ శ్రేణులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఎన్నికల ముందు ఉన్న ఐక్యత ఎక్కడ? అంతా నాటకమా? రాజకీయ ఎత్తుల్లో భాగమా? అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.