Telangana Elections: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాళ్ల దాడి.. పలువురికి గాయాలు..

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణలో ఇరు పార్టీల శ్రేణులతో పాటు.. రోడ్డుపై వెళ్తున్న వారికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.

Telangana Elections: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య రాళ్ల దాడి.. పలువురికి గాయాలు..
New Update

Ibrahimpatnam Constituency: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలకు చెందిన నేతలు.. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) నియోజకవర్గంలో ఒకేసారి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వెళ్తుంటే.. ఒక పార్టీపై మరొక పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై రాళ్లు విసురుకున్నారు. ఈ ఘటనలో ఇరు పార్టీలకు చెందిన నాయకులకు, కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ జెండాలను కాంగ్రెస్ నాయకులపై, కాంగ్రెస్ పార్టీ జెండాలను బీఆర్ఎస్ నాయకులపై విసురుకున్నారు.



కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి భారీ ర్యాలీతో నామినేష్ వేయడానికి వెళ్తున్న సమయంలోనే.. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి కూడా భారీ ర్యాలీతో నామినేషన్ కోసం బయలుదేరారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల ఘర్షణలతో అలర్ట్ అయిన పోలీసులు.. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ ఘటనలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయాలు అయ్యాయి.

Also Read:

మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం.. గాయాలు..!

కేసీఆర్, రేవంత్, కిషన్ రెడ్డి.. సారథుల పొలిటికల్ హిస్టరీ..

#ibrahimpatnam #telangana-elections #brs-vs-congress #telangana-politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe