Telangana Elections:ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తత.. పలు ప్రాంతాల్లో కొట్లాటలు!

తెలంగాణ పోలింగ్ షురూ అయిన తర్వాత కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య లోపులాటు, వాగ్వాదాలు జరిగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జీలు చేయవలసి వస్తోంది.

New Update
Telangana Elections:ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తత.. పలు ప్రాంతాల్లో కొట్లాటలు!

ఎన్నికల పోలింగ్ అంటే గొడవలు జరగడం చాలా సహజం. అందుకే ప్రతీ పోలింగ్ బూత్ దగ్గరా పోలీసులు పహారా కాస్తుంటారు. అయినా కూడా ఎవరో ఒకరు గొడవకు దిగుతూనే ఉంటారు కూడా. ఈ సారి ఎన్నికల పోలింగ్ లో కూడా అక్కడక్కడా గొడవలు జరిగాయి. అన్నింటికంటే సూర్యపేట జిల్లాలో పెద్దగా గొడవ జరిగింది. మఠంపల్లి మండల కేంద్రంలోని యుపిఎస్ పాఠశాల వద్ద ఓటు గాదె నవీన్ అనే వ్యక్తి వెళ్లాడు. బైక్ వాళ్ల బంధువులను ఓటు వేసేందుకు తీసుకెళ్లాడు. బైక్ దిగగానే ఎమ్మెల్యే సైదిరెడ్డి మేనమామ శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుచరులు 20 మంది ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్తావా అంటూ నవీన్ ను కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారని బాధితుడు తెలిపాడు. అక్కడున్నవారంతా ఆపేందుకు ప్రయత్నించడంతో దగ్గరకు వస్తే చంపుతామని బెది అక్కడున్న ప్రజలు ఆపటానికి ప్రయత్నించిన వారిని సైతం దగ్గరకొస్తే చంపుతామని బెదిరించినట్లు తెలిపాడు. కర్రలతో కొడుతున్నప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు వేసేందుకు కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని పోలీస్ అధికారులు వెంటనే కలగజేసుకుని ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా పోలింగ్ సరళి సజావుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Also Read:ర్యాపిడోలో ఫ్రీగా పోలింగ్ కేంద్రాలకు..

మరోవైపు నాగర్‌ కర్నూలు అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద తోపులాట సంభవించింది. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జి చేశారు.గద్వాల జిల్లా ఐజా ప్రభుత్వ పాఠశాల పోలింగ్‌ కేంద్రం వద్ద కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నా పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. అలాగే జనగామ జిల్లా 245వ నెంబర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్‌, సీపీఐ, బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని వాళ్ళను చెదరగొట్టారు.
ఇక నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో విజయమేరి పోలింగ్‌ కేంద్రం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు గొడవపడ్డారు. అక్కడితో ఆగకుండా కొట్లాటకు దిగబోతుంటే పోలీసులు లాఠీ ఛార్జి చేసి చెదరగొట్టారు. ఇంకా జనగామలోని 214 పోలింగ్ కేంద్రం దగ్గర, చౌడాపూర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షనకు దిగగా..పోలీసులు లాఠీ చార్జి చేసి వారిని చెదరగొట్టారు.

మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లా వంకేశ్వరం పోలింగ్ బూత్ దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరి మీద ఒకరు రాళ్ళతో దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల మీద లాఠీ ఛార్జి చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు