మున్సిపల్ కౌన్సిలర్‌పై దాడి చేసి గాయపరిచిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది. వేదిక మీద ప్రజా నాయకులకు చోటులేదని, పార్టీ లీడర్లకే పరిమితమని బీజేపీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ కుమ్మరి రాజు స్టేజి కింద ఉండి ఎమ్మెల్యేను నిలదీయడంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ లీడర్ జయరాజ్ కలుగజేసుకొని కౌన్సిలర్‌పై దాడి చేశాడు. రాజును గళ్లపట్టి పక్కకు దొబ్బడంతో కొద్దిసేపు అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. దీనితో సహనం కోల్పోయిన బీజేపీ నాయకులు.. బీసీ బంధు చెక్కుల పంపిణీ ప్రభుత్వ ప్రోగ్రాం కాకుండా పార్టీ కార్యక్రమంగా చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ గుండాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు.
కులవృత్తుల చెక్కుల పంపిణీ కార్యక్రమం వద్ద బీజేపీ-బీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రారంభోత్సవం చేపట్టడంతో నగరంలోని బీఆర్‌ఎస్ నేతలు హాజరైయ్యారు. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న బీజేపీ నేతలు కలవృత్తుల చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేని నిలదీయంతో బీఆర్‌ఎస్ నాయకులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీఆర్‌ఎస్ నేతలు ఏకంగా గల్ల పట్టుకోని బీజేపీ నేతలపై దాడి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, నాయకుల మధ్య గోడవ కాకుండా అడ్డుకున్నారు. పోలీసులు ఇరు నాయకులను సముదాయించడంతో వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దౌర్జన్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.