AP Crime : ఏపీలో దారుణం... వైన్‌ షాపు దగ్గర గొడవ.. ఒకరి హత్య!

తణుకు మండలం దువ్వ గ్రామంలోఓ దారుణ ఘటన చోటు చేసుకుంది.పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు (40), దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మద్యం తాగిన మత్తులో గొడవ జరిగింది. ఈ క్రమంలో రామకృష్ణ భాస్కరరావు మీద గాజు పెంకుతో దాడి చేసి హత్య చేశాడు.

New Update
AP: పసిబిడ్డను చూసేందుకు వచ్చిన తండ్రి.. అప్పుడే అనంతలోకాలకు..!

West Godavari District : ఫుల్లుగా మద్యం (Liquor) తాగి కొందరు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంటారు. కొన్ని సందర్భాల్లో పక్కవారితో గొడవ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. తాగిన మత్తులో ఇరువురి మధ్య ఘర్షణ జరగగా.. ఓ వ్యక్తి దారుణ హత్య (Killed) కు గురయ్యాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు (Tanuku) మండలం దువ్వ గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఈ దారుణ ఘటన (Clash Near Wines) చోటు చేసుకుంది. పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు (40), దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మధ్య దువ్వలోని ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గర తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే, గొడవ ఎందుకని వెనక్కి తగ్గిన భాస్కరరావు మోటారుసైకిల్‌పై వెళ్లిపోతుండగా అతడి పై గాజుపెంకుతో దాడి చేసి చాతీ భాగంలో పొడిచాడు రామకృష్ణ అనే వ్యక్తి.

అయినప్పటికీ కూడా భాస్కరరావు అలాగే బండిపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు భాస్కరరావు మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో ఘటనా స్థలానికి తణుకు రూరల్‌ సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై కె.చంద్రశేఖర్‌ చేరుకున్నారు. ఘటన గురించి కేసు నమోదు చేసి నిందితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Also read: రాష్ట్ర వ్యాప్తంగా రాగల 24 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు!

Advertisment
తాజా కథనాలు