Free Civils Coaching : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ భారీ ఊరట కలిగించే వార్త చెప్పింది. గిరిజన స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అర్హులైన అభ్యర్థులకు సివిల్స్-2025 కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ప్రకటించారు. ఆసక్తిగల అభ్యర్థులు స్టడీ సర్కిల్ (Study Circle) వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో జూన్13 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఈ అభ్యర్థులంతా అనర్హులే..
అలాగే అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల్లోపు ఉండాలని చెప్పారు. డిగ్రీ పూర్తిచేసి సీశాట్-2025 పరీక్షకు అర్హత సాధించి ఉండాలని, ఉద్యోగాలు చేస్తున్న, ఇతర కోచింగ్ సంస్థల్లో శిక్షణ పొందుతున్న, ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో శిక్షణ తీసుకున్న అభ్యర్థులను అనర్హులుగా పేర్కొన్నారు. అభ్యర్థులందరికీ పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని గిరిజన స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ అందిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు 62817 66534 ఫోన్ నంబరులో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సంప్రదించాలని తెలిపారు.
దరఖాస్తు గడువు :
- జూన్ 13 నుంచి 30 లోపు కలదు.
- ఆన్‌లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు :
విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాదించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలు మించకూడదు.
వయోపరిమితి :
21 ఏళ్ళు నిండి ఉండాలి
ఎంపిక విధానం:
ఆబ్జెక్టివ్ విధానంలో ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపికను చేపట్టనున్నారు.
సౌకర్యాలు:
ఉచిత వసతి, భోజనం.
8,000/- రూపాయల విలువ చేసే పుస్తకాల పంపిణీ.
లైబ్రరీ సౌకర్యం కలదు.
కంప్యూటర్ ల్యాబ్ లు కలవు.
నెలకు పాకెట్ మనీ 750/ (బాయ్స్), 1,000/- (గర్ల్స్) ఇవ్వబడును.
అప్లికేషన్ లింక్ : https://studycircle.cgg.gov.in/TSTWUPSCReg2425.do